New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి
అమెరికా న్యూయార్క్‌లో కాల్పులు కలకలం రేపాయి. మ్యాన్‌హట్టన్‌లోని ఓ కార్యాలయంపై జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక ఆఫ్-డ్యూటీ న్యూయార్క్ నగర పోలీస్ అధికారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.