USA: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ICE అధికారి

అమెరికా మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
ICE officer kills a Minneapolis driver in usa

ICE officer kills a Minneapolis driver in usa

అమెరికా(america) మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(United States Immigration and Customs Enforcement) (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం ICE అధికారులు మినయాపోలిస్‌లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే 37 ఏళ్ల రీని నికొల్ గుడ్‌ అనే మహిళ ప్రయాణిస్తున్న కారును ICE అధికారులు అడ్డుకునేందుకు యత్నించారు. కానీ ఆమె ఆపకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఓ అధికారి కాల్పులు జరిపగా.. ఈ కాల్పుల్లో నికొల్ గుడ్‌ ప్రాణాలు కోల్పోయారు.

Also Read: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

ICE Officer Kills A Minneapolis Driver

అయితే ఆ మహిళ తన కారుతో అధికారిని ఢీకొట్టి చంపాలనుకుందని హోంలాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌ తెలిపారు. అందుకే ఆయన ఆత్మరక్షణ కోసం ఆమెపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే మినియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ఈ వాదనలు తోసిపుచ్చారు. వీడియోల ఆధారాలను చూసి ఆ అధికారియే నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు చేశారు.   

Also Read: వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన

ఈ ఘటన జరిగిన తర్వాత ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ICE అధికారులు నగరం నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ICE అధికారి ఆ మహిళను కాల్చిచంపడంపై సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.  

Advertisment
తాజా కథనాలు