/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-10-13-21.jpg)
India faces sanctions and 500% tariffs? ‘Severe’ warning hidden in Trump’s Bipartisan Bill
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై ఏకంగా 5-00 శాతం సుంకాలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయంపై రిపబ్లికన్ సెనెటర్ లిన్సే గ్రాహం ఎక్స్‌లో చేసిన పోస్టు ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్‌తో సమావేశమై పలు అంశాలపై తాను చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
Also Read: ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేసి నిధులు సమకూర్చుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను ఇకనుంచి కొనుగోలు చేయకుండా ఈ ఈ బిల్లు అడ్డుకుంటుందని వెల్లడించారు. రష్యాపై ఉన్న ఆంక్షలు ఉల్లంఘించే ఆయా దేశాలపై 500 శాతం టారిఫ్ విధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. పుతిన్ యుద్దం ఆపడానికి రెడీ అంటూనే అమాయకులను చంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో చైనా మొదటిస్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఎప్పటినుంచో కోపంతో ఉన్నారు. ఈ కారణంతోనే గతేడాది భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచారు. ఇదిలాఉండగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ 500 శాతం టారిఫ్‌లు పెంచే బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us