/rtv/media/media_files/2026/01/22/trump-eu-2026-01-22-08-41-14.jpg)
గ్రీన్ ల్యాండ్ విషయంలో తొందరపడకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అర్థమైనట్టు ఉంది. అందుకే ఇంతకు ముందు చూపించిన దూకుడును అమాంతం తగ్గించేశారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో వెనక్కు తగ్గుతున్నట్టు చెప్పారు. గ్రీన్‌లాండ్, డెన్మార్క్ ప్రజలంటే నాకెంతో గౌరవం. డెన్మార్క్ కోసం మేం పోరాటం చేశాం. భారీ మంచుతో కూడిన ఈ ప్రాంతాన్ని.. మూర్ఖంగా తిరిగి ఇచ్చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇది అమెరికా, రష్యా, చైనాల మధ్య ఉండే కీలక ప్రదేశం. వ్యూహాత్మక అవసరాల కోసం అది మాకు అవసరం. అరుదైన ఖనిజాల కోసం కాదు. ఎన్నో ఐరోపా దేశాలు ఆయా భూ భాగాలను స్వాధీనం చేసుకున్నాయి. వాస్తవానికి గ్రీన్‌లాండ్ అమెరికాదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్‌కు ఇచ్చేశాం. అమెరికా జాతీయ భద్రత కోసం ఇది మాకు కావాలి. వాళ్ళు ఇవ్వకపోతే గుర్తు పెట్టుకుంటాం.. ఏదేమైనా బలవంతంగా స్వాధీనం చేసుకోం. దీనిపై చర్చలు అవసరమని ట్రంప్ చెప్పారు.
సుంకాల్లేవు..అంతకంటే మంచి దారి..
ఇప్పుడు దానికి తోడు ఈయూపై సుంకాలను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రెట్టె తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోసల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాటో సెక్రటరీ మార్క్ రొట్టెతో చర్చలు చాలా బాగా జరిగాయని...గ్రీన్ ల్యాండ్, ఆర్కిటిక్ విషయంలో ఓ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించామని చెప్పారు. అది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటూ నాటూ మిత్ర దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. అందుకే సుంకాలను వెనక్కు తీసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్ లు అమల్లోకి రావని చెప్పారు. గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణం పైనా చర్చలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ వోకే రాస్ముస్సేన్ స్వాగతించారు. ఇది చాలా సానుకూలపరిణామమని అన్నారు.
ట్రేడ్ డీల్ నిరాకరణ..
అంతకు ముందు గ్రీన్‌లాండ్ విషయంలో మొండిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈయూ కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ తో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా ఈయూ పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.
Also Read: Bill Gates: మరో నాలుగైదేళ్ళల్లో ఉద్యోగాలు పోతాయి..బిల్ గేట్స్
Follow Us