/rtv/media/media_files/2026/01/20/trump-nobel-2026-01-20-09-16-59.jpg)
గ్రీన్ ల్యాండ్ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తూనే ఉంది. వాటికి తోడు ఆయన వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా నార్వే ప్రధాని జోనస్ కు ట్రంప్ సందేశం పంపించారు. అందులో తాను 8 యుద్ధాలను ఆపానని..అయినా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని నార్వే నిర్ణయించింది. అందుకే తాను ఇక మీదట అలాంటి ప్రయత్నాలను మానుకుంటానని...శాంతి గురించి ఆలోచించని చెప్పారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ తీసుకున్న నిర్ణయం దౌత్యం పట్ల తన విధానాన్ని మార్చివేసిందని వాదించారు. ఈ విషయాన్ని నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్ కు ఫోన్ లో ఈ విషయాన్ని తెలిపారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో వదిలిపెట్టేదే లేదని...దానిని ఎలా అయినా దక్కించుకుంటామని చెప్పారు. శాంతి "ప్రధానంగా" ఉన్నప్పటికీ.. ఇప్పుడు "యునైటెడ్ స్టేట్స్‌కు ఏది మంచిదో మరియు ఏది సముచితమో" తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు.
అసలు డెన్మార్క్ కు ఏం హక్కు ఉంది?
గ్రీన్ ల్యాండ్ పై డెన్మార్క్ కు ఏం హక్కు ఉందని నార్వే ప్రధాని స్టోర్ ను ప్రశ్నించారు ట్రంప్. ఆ దీవి తమదేనని చెప్పడానికి డెన్మార్క దగ్గర ఏ ఆధారం ఉందని అడిగారు. వ్రాత పూర్వకంగా పత్రాలు లేవని అన్నారు. వందల ఏళ్ళ క్రితం తమ దేశ పడవ ఒక్కటి ఆ ద్వీపానికి వెళ్లిందని మాత్రమే డెన్మార్క్ చెబుతోందని, అలాగైతే తమ పడవలు చాలానే ఆ ద్వీపానికి వెళ్లాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించాలని చైనా, రష్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి...వాటిని డెన్మార్క్ ఎదురుకోగలదా అని ప్రశ్నించారు. తనకు తెలిసి డెన్మార్క్ కు ఆ సత్తా లేదని అన్నారు. నాటో కోసం తాను ఎంతో చేశానని.. ఇప్పుడు అమెరికా కోసం నాటో ఏదో ఒకటి చేయాలని అన్నారు. గ్రీన్ ల్యాండ్ ను తాము దక్కించుకోవాలనుకుంటున్నది...ప్రపంచ రక్షణ కోసమే అని చెప్పుకొచ్చారు.
దీనికి నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతితో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, విజేతలను స్వతంత్ర నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుందని చెప్పారు. నేను దీనిని చాలాసార్లు అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టంగా వివరించానని స్టోర్ అన్నారు. మరోవైపు ట్రంప్ సందేశం నాటో, యూరప్‌తో సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని అమెరికాలోని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. యురేషియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ దీనిని వ్యక్తిగత ఫిర్యాదులు, అధికార రాజకీయాల మిశ్రమంగా అభివర్ణించారు. జాతీయ భద్రతా లక్ష్యాలను అంతర్జాతీయ అవార్డులతో అనుసంధానించడం వల్ల అమెరికా విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో విధాన ప్రణాళిక మాజీ డైరెక్టర్ అన్నే-మేరీ స్లాటర్ సోషల్ మీడియాలో దీనిని వింత అంటూ ఉటంకించారు. అలాగే ట్రంప్ నోబెల్ విషయంలో ఉన్న కోపాన్ని చూసి రిపబ్లికన్ చట్టసభ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను తన స్వాధీనంలోకి తీసుకురావడానికి ఆయన సలహాదారులు కొందరు కారణమని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: Team India: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్..ఈ బౌలింగ్ తో గట్టెక్కుతారా?
Follow Us