/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t175109-2026-01-20-17-54-15.jpg)
Trump shares map with Canada, Greenland, Venezuela
అమెరికా(america) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నంత పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఐరోపా దేశాలు అడ్డు చెబుతున్నాయి. ట్రంప్ ఆలోచన తప్పని బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. కానీ ట్రంప్ వారి మాటలు వినడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. తన మాట వినని దేశాలపై ట్రంప్ వాణిజ్య సుంకాలతో విరుచుకు పడుతున్నా ఆయా దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు సంచలనంగా మారాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t175009-2026-01-20-17-54-52.jpg)
Also Read : ట్రంప్ తీసుకొచ్చిన 'బోర్డు ఆఫ్ పీస్' గురించి తెలుసా ? ఇందులో రూల్స్ తెలిస్తే షాకైపోతారు.
Trump Controversial Map
తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన అమెరికా కొత్త మ్యాప్‌లో కెనడా, వెనిజులా(us vs venezuela), గ్రీన్ లాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించడం కలకలం రేపింది. అంటే ఆ మూడు ప్రాంతాలను అమెరికాలో కలుపుకోవడానికి ట్రంప్ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కాగా, ఈ అంంశం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఏఐతో -జనరేట్ చేసిన ఈ మ్యాప్‌లో ఈ మూడు ప్రాంతాలను అమెరికాలో భాగంగా చిత్రీకరించిన ట్రంప్.. గ్రీన్ లాండ్‌ను "యూఎస్ టెరిటరీ ఎస్టాబ్లిష్డ్ 2026" అని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోలతో కలిసి గ్రీన్ లాండ్‌లో అమెరికా జెండా పాతినట్టున్న ఫొటోలను కూడా ట్రంప్ పోస్ట్ చేయటం సంచలనంగా మారింది.
ఓవల్ ఆఫీసులో నాటో నాయకులతో ట్రంప్ సమావేశంలో ఉన్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఆ ఫొటోలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి నాయకులు ఉన్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t175024-2026-01-20-17-55-33.jpg)
Also Read : గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు.. డెన్మార్క్ ను భయపెట్టడానికేనా?
గత ఏడాది అధికారంలోకి వచ్చిన ట్రంప్ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా ప్రతిపాదించారు. దీన్ని కెనడా ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అలాగే మరోవైపు.. వెనిజులా విషయంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరించారు. అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి న్యూయార్క్ తీసుకెళ్లిపోయాడు. అంతేకాదు క్రూడ్ ఆయిల్ నిల్వలపై అమెరికా కంపెనీలు నియంత్రణ ఉంటుందని ప్రకటించాడు. వెనిజులాను ఇకపై అమెరికానే నడిపిస్తుందని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా గ్రీన్ లాండ్(green-land) విషయంలో ట్రంప్(america president donald trump) తీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఖనిజ సంపద కలిగిన ఈ ద్వీపం అమెరికా జాతీయ భద్రతకు కీలకమని భావిస్తున్నారు ట్రంప్. తనను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. ఇకపై తాను కేవలం "శాంతి" గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని నార్వే ప్రధానికి పంపిన సందేశంలో తేల్చి చెప్పారు. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ లాండ్‌పై తనకు పూర్తి నియంత్రణ కావాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న యూరోపియన్ మిత్రదేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతోఅంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ట్రంప్ చేస్తున్న ఈ దూకుడు ప్రపంచ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us