/rtv/media/media_files/2026/01/21/mecron-2026-01-21-07-49-30.jpg)
మనం నిబంధనల్లేని ప్రపంచంలోకి వెళుతున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆందోళన వ్యక్తంచేశారు. సుంకాల ద్వారా ఐరోపాను అణిచివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ట్రేడ్ బజూకాకు సిద్ధం కావాలని ఆయన ఐరోపా కూటమికి పిలుపునిచ్చారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మెక్రాన్...ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ చట్టం బలవంతుల అదుపు ఆజ్ఞల్లో పడి కొట్టుకుపోతోందని ఆరోపించారు. సామ్రాజ్య వాదం మళ్లీ పురుడుపోసుకుంటోంది. ట్రంప్ విధిస్తున్న అంులేని సుంకాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మెక్రాన్ అన్నారు. మేము బెదిరించే వారికంటే గౌరవానికి ప్రాధాన్యమిస్తాం. ట్రేడ్ బజూకా అమల్లో రెండో ఆలోచన చేయవద్దు. మనం నిర్బంధ వ్యతిరేక చర్యలను చేపట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాం. దీని వలన రాజకీయ బ్లాక్ మెయిల్ నుంచి రక్షణ పొందుతామని మెక్రాన్ అన్నారు. మనం దీనిని అమలుచేస్తే అమెరికాపై 81 బిలియన్ పౌండ్ల సుంకాలు పడతాయి. ఇది ట్రంప్ మనసు మార్చడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
మేము కూడా వ్యతిరేకిస్తున్నాం...
గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, విధిస్తున్న సుంకాలను కెనడా సైతం ఖండించింది. ఆ దేశ ప్రధాని మార్గ కార్నీ సుంకాల విషయంపై దుయ్యబట్టారు. తాము గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లకు అండగా ఉంటామని దావోస్‌లో ఆయన స్పష్టం చేశారు. నాటో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం.. కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి చేసినా మొత్తం కూటమిపై దాడి చేసినట్లేనని తేల్చి చెప్పారు.
మరోవైపు దావోస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం ముందు అక్కడ నో కింగ్స్ ప్రొటెస్ట్ వెలుగు చూసింది. దావోస్ పర్వతాలపై నో కింగ్స్ అని పెద్ద అక్షరాలతో రాసిన బోర్డు దర్శనమిచ్చింది. పది మంది స్థానికులు 450 టార్చ్‌లతో దీనిని ప్రదర్శించారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు రేకెత్తాయని చెబుతున్నారు.
Also Read: Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి
Follow Us