Accident: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం!
యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజ్వీర్ సింగ్ తెలిపారు.
Ajith: పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు..ఇది రెండో సారి
హీరో అజిత్ రేసింగ్ కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ఇది జరిగింది. అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు.
Kumbhmela Accident: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. హృదయవిదారక దృశ్యాలు!
వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారే.
Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి
కర్ణాటలో లారీని నడుపుతుండగా డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపు వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యక్తి మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు.
Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Ap: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం...స్పాట్ లోనే తల్లి,ఇద్దరు కొడుకులు దుర్మరణం!
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళ్తున్న కారుని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) మృతి చెందారు.
Kumbh Mela Accident: కుంభమేళాలో మరో ప్రమాదం.. నలుగురి దుర్మరణం!
బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.