Madhya Pradesh : బలి ఇవ్వడానికి వెళ్తూ బలైన కుటుంబం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కారు వంతెనపై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్‌పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది.

New Update
Car falls off bridge in Jabalpur

Car falls off bridge in Jabalpur

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో గురువారం వేగంగా వస్తున్న SUV వాహనం వంతెన సైడ్ రెయిలింగ్‌ను ఢీకొట్టి దాదాపు 30 అడుగుల లోతున్న ఎండిపోయిన నదీగర్భంలో పడిపోయిన ఘటనలో  నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  పటేల్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు నర్సింగ్‌పూర్‌లోని దాదాదర్బార్‌ను సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా దేవుడికి బలివ్వడం కోసం కోడి, మేకతో బయలు దేరిన కుటుంబం ప్రమాదానికి గురికావడంతో విషాదం చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

జబల్పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని బార్గి నగర పోలీసు సూపరింటెండెంట్ అంజుల్ మిశ్రా తెలిపారు."వేగంగా వస్తున్న SUV కారు రెయిలింగ్‌ను విరిగి వంతెనపై నుండి సోమతి నది ఎండిన ఇసుకపై పడిపోయింది. పటేల్ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో ప్రయాణిస్తున్నారు. వారు నర్సింగ్‌పూర్‌లోని దాదా దర్బార్‌ను సందర్శించడానికి వెళ్లి జబల్‌పూర్‌కు తిరిగి వస్తున్నారు" అని మిశ్రా చెప్పారు.

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కిషన్ పటేల్ (35), మహేంద్ర పటేల్ (35), సాగర్ పటేల్ (17), రాజేంద్ర పటేల్ (36) అక్కడికక్కడే మరణించారు. జితేంద్ర పటేల్ మరియు మనోజ్ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. "వారు తీసుకెళ్తున్న కోడి చనిపోయింది, వాహనంలో ఉన్న మేక చెవి తెగిపోయింది" అని అధికారి తెలిపారు. ధ్వంసమైన వాహనం నుంచి మృతదేహాలను చాలా కష్టపడి తొలగించామని చార్గవాన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిషేక్ ప్యాసి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు