/rtv/media/media_files/2025/04/27/VGgcFjZwYyLqV6dNsed2.jpg)
bike-accident suryapet
తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చెడే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తనకు విద్యాబుద్ధులు నేర్పి తనను ఇంతటి ఉన్నతస్థాయికి చేర్చిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది. ఆ బైక్ ను తీసుకుని హైదరాబాద్ నుంచి తన కొలీగ్ నాగఅచ్యుత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేంది.
Also read : India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా
అయితే శనివారం అర్ధరాత్రి 12:30 గంటట సమయంలో ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడనుంచి పరారయ్యాడు. బాధితురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్