Road Accident: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి

హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ, ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలైయ్యారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

New Update
Delhi Mumbai Expressway

హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది. యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి -ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Road Accident In Haryana

Also Read :  ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన పారిశుద్ధ్య కార్మికుల్లో ఐదుగురు ఖేరీ కలాన్ గ్రామానికి చెందినవారని, ఒకరు జిమ్రావత్ గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పారిపోయిన డ్రైవర్‌ను కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను దొరకగానే అరెస్ట్‌ చేయనున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు.

Also Read :  టెర్రరిస్టుల అటాక్.. వెలుగులోకి మరొక షాకింగ్ వీడియో - అందరి ముందే కిరాతంగా కాల్చేశారు!

Also Read :  పేడను స్వీట్ అని అమ్మేస్తున్న చైనా.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

(oad-accident | haryana | latest-telugu-news | road-accident)

Advertisment
తాజా కథనాలు