ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్కార్డులోని పుట్టిన తేదీ మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.