New Aadhar APP: ఫోన్లోనే ఆధార్‌లో మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్.. అదిరిపోయే కొత్త యాప్ ఇదే!

కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28న సరికొత్త 'ఆధార్ యాప్' పూర్తి స్థాయి వెర్షన్‌ను అఫిషియల్‌గా లాంచ్ చేసింది. UIDAI రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాదలు న్యూఢిల్లీలో ప్రారంభించారు.

New Update
eAadhaar app launched

eAadhaar app launched

కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28న సరికొత్త 'ఆధార్ యాప్' పూర్తి స్థాయి వెర్షన్‌ను అఫిషియల్‌గా లాంచ్ చేసింది. UIDAI రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాదలు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గతంలో ఆధార్ వివరాల మార్పు కోసం ఆధార్ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త యాప్ ద్వారా పౌరులు తమ మొబైల్ నుండే అనేక సేవలను పొందే వీలుంది.

మొబైల్ నంబర్, చిరునామా ఈ కొత్త యాప్‌లో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను, ఇంటి అడ్రెస్‌ను నేరుగా యాప్ ద్వారానే అప్‌డేట్(aadhaar-update) చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం 'ఫేస్ ఆథెంటికేషన్' ప్రక్రియను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అభ్యర్థులు తమ ముఖాన్ని స్కాన్ చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవచ్చు. చిరునామా మార్పు కోసం అవసరమైన పత్రాలను యాప్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవలకు గానూ ప్రభుత్వం రూ.75 ఫీజుగా నిర్ణయించింది. ఈ మార్పులు పూర్తవ్వడానికి సుమారు 14 నుండి 30 రోజుల సమయం పడుతుంది.

Also Read :  ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. సోషల్‌ మీడియా వాడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే

కొత్త యాప్ స్పెషల్ ఫీచర్లు:

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్: ఇంటర్నెట్ లేకపోయినా క్యూఆర్ కోడ్ ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవచ్చు.
సెలెక్టివ్ షేరింగ్: మీ ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా, అవసరమైన వివరాలను మాత్రమే ఇతరులతో పంచుకునే వెసులుబాటు ఉంది.
మల్టీ-ప్రొఫైల్: ఒకే యాప్‌లో కుటుంబంలోని ఐదుగురు సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్‌ను జోడించి నిర్వహించవచ్చు.
బయోమెట్రిక్ లాక్: మీ వేలిముద్రలు, ఐరిస్ డేటా దుర్వినియోగం కాకుండా యాప్ ద్వారానే లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.
బహుభాషా సౌకర్యం: ఈ యాప్ తెలుగుతో సహా మొత్తం 14 ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. - aadhaar-card

Also Read :  రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన .. ఎలా అరుస్తున్నాడో చూడండి!

డౌన్‌లోడ్ చేయడం ఎలా?

వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి "Aadhaar" అని సెర్చ్ చేసి అధికారిక UIDAI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఆధార్ నంబర్, ఓటీపీతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. భద్రత కోసం 6 అంకెల సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ యాప్ వల్ల భౌతిక ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా గుర్తింపును నిరూపించుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు