Ashi Roy Key Comments On Bangalore Rave Party : బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ (Rave Party) పై టాలీవుడ్ (Tollywood) లో దుమారం రేపుతోంది. ఆ పార్టీలో పలువులు సినీనటుడు పాల్గొనడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవ్‌పార్టీపై నటి ఆషీరాయ్ (Ashi Roy) సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అంటూ పేర్కొన్నారు. అయితే లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ వీడియో రిలీజ్ చేశారు. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకునే వెళ్లానని ఆషీరాయ్ అన్నారు. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఎస్సై సెకండ్ సెటప్.. భార్య ఆందోళన
అయితే ఈ పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామని బెంగళూరు సీపీ తెలిపారు. ఇప్పటివరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ తీసుకున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పట్టుబడినవారిలో చాలామంది హైదరాబాద్ టెకీలు ఉన్నారని చెప్పారు. ఈ పార్టీలో 15 గ్రాముల HMDA, 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక్క రోజుకు దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్న అందరి నుంచి రక్త నమూనాలను సేకరించామని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also read: తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..
అది రేవ్ పార్టీ కాదు.. బర్త్‌డే పార్టీ
వాసు అన్నయ్య పార్టీ అని పిలిస్తే వెళ్ళాను – ఆషి రాయ్ pic.twitter.com/jn98T3FTfI
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024