నటి ప్రగ్యా నగ్రా.. ఈ పేరు దాదాపు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ కావడమే దీనికి ప్రధాన కారణం. దీంతో చాలా మంది అందుకు సంబంధించిన వీడియో చూసేందుకు నటి పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు.
అందుకు సంబంధించిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా.. దీనిపై ఈ అమ్మడు తాజాగా స్పందించింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చింది. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో ఎడిట్ చేయబడింది అని ఆమె తెలిపింది.
ఇలాంటి ఫేక్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్న వారిని చూస్తే జాలేస్తోందని పేర్కొంది. ఇక తనలాంటి వారు అసభ్యకర డీప్ ఫేక్ వీడియోల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టింది.
ప్రగ్యా క్లారిటీ
‘‘ఇప్పటికీ ఈ విషయాన్ని తీసుకోలేకపోతున్నాను. అది ఒక పీడకల అయి ఉంటుందని భావిస్తున్నాను. టెక్నాలజీ అనేది మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. అది మన జీవితాలను దుర్భరంగా మార్చకూడదు. అటువంటి AI కంటెంట్‌ని క్రియేట్ చేసి దానిని దుర్వినియోగం చేయడమే కాకుండా.. అలాంటి వాటిని వ్యాప్తి చేసే వ్యక్తుల పట్ల జాలేస్తోంది. అయితే వీటన్నింటికీ బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి క్షణాలలో నా కోసం ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. మరెవ్వరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని, మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.’’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.
Still in denial, and still hoping that it’s just a bad dream that I will wake up from. Technology was meant to help us and not make our lives miserable.
— Pragya Nagra (@PragyaNagra) December 7, 2024
Can just pity the evil minds who misuse it to create such AI content and the people who help spread it!
Trying to stay strong…
Also Read: అధిక కోపం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?
ఏం జరిగిందంటే?
తాజాగా మలయాళ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఒంటిమీద బట్టలు లేకుండా ఆమె తన ప్రియుడితో ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం!
ముఖం ప్రగ్యా లానే ఉండడంతో అది నటి వీడియోనే అని అంతా చర్చించుకుంటున్నారు. దీంతో ఆ వీడియోలను కొందరు గుర్తుతెలియని దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో నటి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె పేరుతో #pragyanagra అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు
ప్రగ్యా సినీ కెరీర్
కాగా ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం అనే సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అనంతరం మరుసటి ఏడాది 2023లో నధికళిల్ సుందరి యమునా అనే మలయాళ చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు భారీ హిట్ కావడంతో అమ్ముడుకి అదిరిపోయే అవకాశాలు వచ్చాయి. ఇటీవలే తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజ్ అయిన ‘లగ్గం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.