Aakasam Lo Oka Tara: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కల్కి సినిమాతో ఆకట్టుకున్న దుల్కర్.. త్వరలో ‘లక్కీ భాస్కర్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. సస్పెన్స్ డ్రామా ఫ్యామిలీ ఎంటటైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
‘ఆకాశంలో ఒక తార’
ఇది ఇలా ఉంటే తాజాగా దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. అయితే నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ గమనిస్తే.. దుల్కర్ సల్మాన్ భుజం పై ఎర్ర కండువా, బ్యాక్ గ్రౌండ్ లో పల్లెటూరు, స్కూల్ వెళ్తున్న చిన్న పాప దృశ్యాలు కనిపించాయి. దీని ప్రకారం మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
This will be SPECIAL❤️
Sky is not the limit ✨
Wishing a blockbuster birthday to our STAR @dulQuer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥
More updates will fly soon ⏳#AakasamLoOkaTara #AOTMovie@Lightboxoffl @GeethaArts @SwapnaCinema… pic.twitter.com/QTuUwEUov5
— pavan sadineni (@pavansadineni) July 28, 2024