/rtv/media/media_files/2025/07/09/alia-bhatt-pa-arrested-2025-07-09-16-48-22.jpg)
Alia Bhatt PA Arrested
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వేదికా ప్రకాష్ శెట్టిని ముంబై జుహు పోలీసులు అరెస్టు చేశారు. అలియా పేరుతో దాదాపు రూ. 76 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : పెంపుడు కుక్క వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా! సర్వేలో షాకింగ్ విషయాలు
వేదికా ప్రకాష్ శెట్టి ఎవరు?
వేదిక శెట్టి 2021లో అలియా పర్సనల్ అసిస్టెంట్‌గా చేరింది. అలియా ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను, వ్యక్తిగత ఖర్చులను వేదికా చూసుకునేది. మొదట్లో ఆమె చాలా నమ్మకస్తురాలిగా వ్యవహరించింది. ఈ సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరి 23న అలియాకు వేదికా నుంచి ఒక ఈవెంట్‌కు సంబంధించిన పేమెంట్ ఇన్వాయిస్ అందిన తర్వాత ఈ మోసం బయటపడింది. దీని గురించి అలియా ఎంక్వైరీ చేయగా..
రూ. 76 లక్షల మోసం
2021 నుంచి 2024 వరకు, వేదికా నకిలీ బిల్లులు తయారు చేసి, వాటిపై అలియా భట్ సంతకాలను ఫోర్జరీ చేసి, దాదాపు రూ. 76 లక్షలను తన సొంత ఖాతాలకు బదిలీ చేసుకుందని తెలిసింది. ఈ మోసం బయటపడిన తర్వాత, అలియా భట్, ఆమె తల్లి ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో వేదికాపై కేసు నమోదు చేశారు.
Also Read: Phone Shaped Slab: ఇది పట్టుకుంటే ఫోన్ కి దూరమైనట్లే!.. కొత్త డిజిటల్ డీటాక్స్ టూల్
కేసు నమోదైన తర్వాత వేదికా పరారీలో ఉంది. పోలీసులు ఆమె కోసం సుమారు ఐదు నెలల పాటు గాలించారు. చివరకు ఆమె కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, అరెస్టు చేశారు. పోలీసులు ఆమెను ముంబైకి తీసుకువచ్చి మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటన బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఒక స్టార్ హీరోయిన్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి చేతిలో ఇంత పెద్ద మోసం జరగడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.
Also Read : ఢిల్లీకి రాజాసింగ్.. రాజీనామా ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్!
cinema-news | alia-bhatt | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news