Shefali Jariwala: షఫాలీ కేసులో బిగ్ ట్విస్ట్.. బెడ్ రూమ్‌లో ఆ టాబ్లెట్‌ గుర్తించిన పోలీసులు!

బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి.  విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.

New Update
Shefali Jariwala house found with anti ageing tablets

Shefali Jariwala house found with anti ageing tablets

బాలీవుడ్ నటి షెఫాలీ మృతికి సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే  విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆమె గత కొన్ని రోజులుగా యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు వాడుతున్నట్లు నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Also Read :  రియాక్టర్‌ పేలుడు..14 కు చేరిన మృతులు..ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా..

ప్రతిరోజు 8-9

ఈ నేపథ్యంలో షెఫాలీ మృతి పై రకరకాల ఊహాగానాలు  వైరల్ అవుతున్నాయి.  పలు నివేదిక ప్రకారం.. షెఫాలీ గత ఏడు నుంచి  ఎనిమిది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా  యాంటీ ఏజింగ్ (వృద్దాప్య ఛాయలు తగ్గించే) సప్లిమెంట్స్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే జూన్ 27న అంటే ఆమె చనిపోయిన రోజు  ఇంట్లో ఏదో పూజ ఉండడంతో ఆమె ఉపవాసం ఉన్నారటా. అయినప్పటికీ.. ఖాళీ కడుపుతో అదే రోజు మధ్యాహ్నం యాంటీ ఏజింగ్  ఇంజెక్షన్ తీసుకున్నారట. 

ఇలా ఖాళీ కడుపుతో ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్లే కార్డియాక్ అరెస్టై ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో ఈ మందులే గుండెపోటుకు ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్పా..  మరణానికి గల ఖచ్చితమైన  కారణం తెలియరాదు. ప్రస్తుతం పోలీసులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే జూన్ 27న రాత్రి 10- 11 గంటల సమయంలో షెఫాలీ  అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో భర్త ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు