Premante:  రొమాంటిక్ గా మారిన ప్రియదర్శి.. 'ప్రేమంటే' ఫస్ట్ లుక్

ప్రియదర్శి మరో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'ప్రేమంటే'  అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి- ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

New Update
Priyadarshi premante movie

Priyadarshi premante movie

'ప్రేమంటే' ఫస్ట్ లుక్

'ప్రేమంటే'  అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి- ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ రొమాంటిక్ లుక్ లో కనిపించారు. 'థ్రిల్ యు ప్రాప్తిరస్తు'  అనే ట్యాగ్ లైన్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు. అక్కినేని హీరో నాగ చైతన్య  మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ వీడియో లాంచ్ చేశారు. 

Also Read :  వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన బుట్టబొమ్మ.. ఇన్ఫ్లూయెన్సర్‌పై భర్త మోజు.. భార్య ఆత్మ*హత్య!

రొమాంటిక్ డ్రామాగా  రూపొందుతున్న ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.  SVCLLP బ్యానర్ పై పుస్కుర్ రామ్ మోహన్ రావు,  సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. లియోన్ జేమ్స్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ 65% పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. 

Also Read: Kota Srinivasa Rao: ''చచ్చేదాక నటించాలి''.. కోట మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!

Also Read :  సమోసా, జిలేబీ తినేవారికి బిగ్ షాక్.. సిగరెట్ లానే హెచ్చరిక!

priyadarshi | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Tollywood news updates | tollywood-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు