Shruti Haasan: శృతి హాసన్ డిజిటల్ డీటాక్స్.. సోషల్ మీడియాకు బ్రేక్!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

New Update
Shruthi Hasan

Shruthi Hasan

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ లేటెస్ట్ ఫొటోలు, వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు శృతి కూడా డిజిటల్ డీటాక్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. ఎంతో మంది సెలబ్రిటీలు ఆన్‌లైన్‌లో ఉండటానికి ఇష్టపడే ఈ రోజుల్లో అడుగు వెనక్కి వేసి ఆత్మపరిశీలన చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో శృతి అభిమానులు ఆమెను త్వరలో తిరిగి ఆన్‌లైన్‌లో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Shruti Haasan digital detox
Shruti Haasan digital detox
అయితే సాధరణంగా శ్రుతి హాసన్ మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత శ్రేయస్సు గురించి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక విరామం అనేది ఆమెకు  కేవలం ఒక బ్రేక్ మాత్రమే కాదు, తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి, పని పట్ల మరింత ద్రుష్టి సారించడానికి ఒక అవకాశమని నెటిజన్లు భావిస్తున్నారు. 

విడుదలకు  ముందు

ఇదిలా ఉంటే  శ్రుతి హాసన్ నటించిన 'కూలీ' త్వరలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ కాస్ట్ కూడా  కూడా ఉన్నారు. ఇంత పెద్ద సినిమా విడుదలకు  ముందు శ్రుతి ఇలా డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కూలీ  ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read :  ఈ రోజు రాత్రి 10 గంటలకు ఏం జరగబోతుంది? భారత్‌, యూఎస్‌ మధ్య కీలక డీల్‌..

డిజిటల్ డిటాక్స్?

డిజిటల్ డిటాక్స్' అంటే మనం రోజూ వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు (డిజిటల్ స్క్రీన్‌లకు) కొంత కాలం దూరంగా ఉండటం. సింపుల్ గా చెప్పాలంటే.. డిజిటల్ గ్యాడ్జెట్స్ కి తాత్కాలిక విరామం ఇవ్వడం అని అర్థం

Also Read:  ఒకే ఏడాదిలో రెండుసార్లు.. ట్రయాథ్లాన్‌ రేస్ లో చరిత్ర సృష్టించిన తొలి నటి!

telugu-film-news | telugu-cinema-news | today-news-in-telugu | latest-telugu-news | actress-shruti-haasan

Advertisment
Advertisment
తాజా కథనాలు