ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్‌ను 97 పరుగుల తేడాతో ఓడించింది. భారత జట్టు విజయంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. మంధాన సెంచరీతో చెలరేగిపోయింది. 211 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మధ్యలోనే చేతులెత్తేసింది.