Yash Dayal: RCB స్టార్ బౌలర్ పై కేసు నమోదు.. ‘నన్ను శారీరకంగా వాడుకున్నాడంటూ CMకి ఫిర్యాదు’

ఆర్‌సిబి స్టార్ బౌలర్ యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. దయాళ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడని యూపీ సీఎంకు ఫిర్యాదు చేసింది.

New Update
rcb star bowler yash dayal accused of sexual harassment fir registered

rcb star bowler yash dayal accused of sexual harassment fir registered

ఆర్సీబీ స్టార్ బౌలర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. ఓ యువతి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. యష్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడని.. ఇప్పుడు మ్యారేజ్‌కు నో అంటున్నాడని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆన్‌లైన్ పోర్టర్‌లో కంప్లైంట్ ఇచ్చింది. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

yash dayal accused of sexual harassment

ఆమె FIRలో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘గత 5 సంవత్సరాలుగా యష్ దయాల్‌తో రిలేషన్‌లో ఉన్నాను. యష్ దయాల్ నన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించేవాడు. కాబోయే కోడలు అంటూ నన్ను తన ఇంట్లో పరిచయం చేశాడు. అయితే కొంత కాలం తర్వాత అతడికి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. 

Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

దీంతో జూన్ 14న మహిళా హెల్ప్‌లైన్ 181కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను. కానీ పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాకు న్యాయం కోసం సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించాను. ఇవన్నీ నిజాలు. వీటన్నింటినీ నిరూపించడానికి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌లు, వీడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. యష్ దయాల్‌ను వీలైనంత త్వరగా శిక్షించాలి’’ అంటూ ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫొటోలు వైరల్‌గా మారాయి.  

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

Advertisment
Advertisment
తాజా కథనాలు