/rtv/media/media_files/2025/06/02/lOLYuDGkcAEZGUnGKmwZ.jpg)
shreyas iyer net worth
ఇప్పుడంతా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ పేరే వినిపిస్తోంది. అందుకు కారణం.. అతడు ఆడిన లేటెస్ట్ మ్యాచ్. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శ్రేయాస్ దుమ్ము దులిపేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా
Shreyas Iyer Net Worth
మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్దేశించిన 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. దీంతో ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ సూపర్ ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఈ విజయానికి ‘కింగ్స్’ కెప్టెన్ శ్రేయాస్ వెన్నెముకగా నిలిచాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 5 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ నెట్ వర్త్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ నెట్ వర్త్ రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. కాగా శ్రేయాస్ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2018లో ఢిల్లీ తరఫున ఆడాడు. ఆ టైంలో ఢిల్లీ ఫ్రాంచైజీ శ్రేయాస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.12.25 కోట్లకు కొనుక్కుంది. ఇక ఇప్పుడు 2025లో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.26.75 కోట్లకు తీసుకుంది.
ఇవి కాకుండా 2022 - 23 వరకు బీసీసీఐ గ్రేడ్ బీ కాంట్రాక్ట్‌లో శ్రేయస్ ఉండేవాడు. అప్పట్లో అతడికి వార్షికంగా రూ.3 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత 2024లో ఆ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. ఇక 2025 - 2026లో మళ్లీ గ్రేడ్ బీ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ రూ.3 కోట్లు అందుతాయి.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
అలాగే శ్రేయాస్ అయ్యర్‌కు ముంబైలోని లోధా వరల్డ్ టవర్‌లో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. దాని విలువ రూ.11.85 కోట్ల వరకు ఉంటుంది. అంతేకాకుండా మెర్సిడెస్ బెంజ్ G63 AMG, లంబోర్ఘిని హురికెన్, ఆడీ ఎస్ 5 వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.6 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.
sports-news | shreyas-iyer | PBKS vs MI