/rtv/media/media_files/2025/06/24/cricketer-rinku-singh-and-mp-priya-saroj-wedding-date-postponed-2025-06-24-14-27-59.jpg)
cricketer rinku singh and mp priya saroj wedding date postponed
టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ - సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడింది. వీరి మ్యారేజ్ నవంబర్ 18, 2025న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అందిన సమాచారం ప్రకారం.. రింకు సింగ్ వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని సమాచారం. అయితే దీని డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా వివాహం వాయిదా పడటానికి క్రికెటర్ రింకు సింగ్ క్రికెట్ పనులు, అతని బిజీ షెడ్యూల్ కారణం అని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
rinku singh wedding postponed
Also Read: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
ఈ నెలలో క్రికెటర్ రింకు సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్‌మెంట్ వేడుక లక్నోలోని ఒక హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు జయా బచ్చన్, అఖిలేష్ యాదవ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ సహా మరెంతో మంది హాజరయ్యారు. నిశ్చితార్థం తర్వాత.. వివాహ తేదీని నవంబర్ 18గా ఖరారు చేశారు.
🟥 Rinku & Priya’s Wedding Postponed: Cricket Called, Ceremony Crashed! 🏏💍
— BharatPaksh (@PakshForBharat) June 24, 2025
Rinku Singh and MP Priya Saroj have postponed their November 19, 2025 wedding due to Rinku’s packed cricket schedule. Now rescheduled for February 2026, the exact date remains under wraps.
The… pic.twitter.com/bCoRQi6Bjb
పెళ్లి వేదికను వారణాసిలోని హోటల్ తాజ్‌లో ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ వివాహ తేదీని మార్చారు. రింకు సింగ్ దేశీయ క్రికెట్ షెడ్యూల్‌లో బిజీ బిజీగా ఉన్నాడని.. ఈ సీజన్ కోసం పూర్తిగా నిమగ్నమై ఉండటంతో రెండు కుటుంబాలు కలిసి వివాహాన్ని కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో జరగనున్న దేశీయ క్రికెట్ టోర్నమెంట్‌లో రింకు సింగ్ ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడతాడని తెలిసింది. దీని కారణంగానే ఇప్పుడు వీరి మ్యారేజ్ డేట్ వాయిదా పడినట్లు చెబుతున్నారు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక