బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సక్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపుర్ కృష్ణ ప్రాంతంలో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో ఓ 16 ఏళ్ళ కుర్రాడు క్లాస్ రూమ్‌లోకి తుపాకీ తీసుకెళ్ళడమే కాకుండా…తన తోటి విద్యార్ధిని మీద కాల్పులు కూడా జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడింది. అయితే వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరూ 11వ తరగతి చదువుకుంటున్నారు.
అయితే బాలుడు, బాలిక ఎవరన్నది పోలీసులు వివరాలు బయటపెట్టలేదు. కాల్పులు జరిపిన వెంటనే ఆ అబ్బాయి పారిపోయాడు. కోచింగ్ సెంటర్లోనే, లాస్‌లోనే బాలుడు కాల్పులు జరిపాడని..ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బుల్లెట్ గాయాలు తగలడంతో బాలిక అక్కడే కుప్పకూలిపోయిందని.. ఆమెను తోటి విద్యార్థులు, సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని వారు చెప్పారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని..అయితే పిల్లవాడు కావడం వలన ఎక్కువ రోజులు తప్పించుకోలేడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. కాల్పులకు కారణం ప్రేమ వ్యవహారమే అయి ఉంటుందని అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Also Read: Vinesh Phogat: ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ