Schools: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు

ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి.

author-image
By B Aravind
New Update
4 Indian schools in race for world's best school awards

4 Indian schools in race for world's best school awards

ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి నాలుగు పాఠశాలలకు పోటీదారులుగా చోటు లభించింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్త విజేతలను ప్రకటిస్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌లోని టీ4 ఎడ్యుకేషన్ అనే సంస్థ ఉంది. ఇది కొవిడ్ మహమ్మారి వచ్చిన సమయంలో.. తరగతి గదుల్లో, వెలుపల జీవితాలను మార్చే పాఠశాలలకు ఓ వేదికను రూపొందించేదుకు 'ప్రపంచ ఉత్తమ పాఠశాలల బహుమతులు' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 

Also Read: ఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రం

Also Read :  యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన

World's Best School Awards

సవాళ్లను అధిగమించడం, సమాజ భాగస్వామ్యం, పర్యావరణ కార్యచరణ, నవకల్పన, ఆరోగ్యకర జీవితాలకు సపోర్ట్‌గా నిలవడం లాంటి 5 విభాగాల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. అయితే ఆరోగ్యకర జీవితాలకు మద్దతు విభాగంలో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న బాలికల సీనియర్ సెకండరీ స్కూల్, సమాజ భాగస్వామ్యం విభాగంలో మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న జెడ్పీ స్కూల్, నవకల్పన విభాగంలో బెంగళూరులోని జేపీ నగర్ ఎక్యా స్కూల్, పర్యావరణ కార్యచరణ విభాగంలో వారణాసిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్.. ఈ నాలుగు పాఠశాలలు కూడా తుది పది పోటీదారులుగా నిలిచాయి. వీటితో పాటు కమ్యూనిటీ ఛాయిస్ విభాగంలో కూడా ఓ బహుమతి లభించనుంది. 

Also Read: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!

ఇక చివరికి ఈ 5 విభాగాల్లో తుది జాబితాలో చోటు సంపాదించిన 50 పాఠశాలలకు ఓటింగ్ నిర్వహిస్తారు. సమాజ ఎంపిక విభాగంలో ఒక పాఠశాలకు పురస్కారం అందిస్తారు. ఈ వారంలోనే దీనికి సంబంధించి ఓటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ పోటీలో విజేతలు, తుది జాబితాలో చోటు సంపాదించిన 50 పాఠశాలల ప్రతినిధులను ఈ ఏడాది నవంబర్‌లో దుబాయ్‌లో జరిగే ప్రపంచ పాఠశాలల సదస్సుకు ఆహ్వానిస్తారు. 

Also Read :  దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

 

telugu-news | school | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు