Ap -Konaseema:బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన జరిగింది. 24వ తేదీ నుంచి వీరంతా కనిపించకుండా పోయారు.

New Update

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం ఖండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరంతా సమీప బంధువులే కావటం గమనార్హం. విద్యార్థులు ఆరుగురు స్థానికంగా ఉన్న హైస్కూలులో చదువుతున్నారు. అయితే ఆరుగురు ఒకేసారి కనిపించకుండా పోయారు.

Also Read: America: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!

 ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పాఠశాలకు సరిగా వెళ్ళడం లేదని తల్లితండ్రులు మందలించడంతోనే వీరంతా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన వారిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.మార్చి నెల 24 నుంచి ఈ ఆరుగురు విద్యార్థులు కనిపించడం లేదని తెలిసింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

వీరందరూ బంధువులే కావటం.. అందరూ కూడా కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతుండటంతో కలిసే ఎక్కడికైనా వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వీరి ఆరుగురి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు నగదు బహుమతి కూడా అందజేస్తామని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ పేర్కొన్నారు.

Also Read: Maoists encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృ‌తి

Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!

konaseema | ambedkar-konaseema | ambedkar-konaseema-district | ambedkars-konaseema-district | missing | latest-news | school | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు