Netflix : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇటీటీలో నేరుగా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌వర్మ, నసీరుద్దీన్‌షా, అరవిందస్వామి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అయితే ఈ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను భోళాశంకర్, బర్గర్, డాక్టర్ అనే వివిధ పేర్లతో చూపించారు.
దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా ఉద్దేశ్యపూర్వకంగా ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరడంతో ప్రసార, మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు సమన్లు జారీచేసింది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read : పదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నా.. సంచలన విషయం బయటపెట్టిన సాయి పల్లవి
సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని ఆమె పేర్కొన్నారు. ‘ 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ గురించి తెలియని ప్రేక్షకుల ప్రయోజనం కోసం, హైజాకర్ల నిజమైన మరియు కోడ్ పేర్లను చేర్చడానికి ప్రారంభ నిరాకరణ అప్డేట్ చేయబడింది. సిరీస్‌లోని కోడ్ పేర్లు ఆ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనను ప్రతిబింబిస్తాయి.
భారతదేశంలో కథలు చెప్పే గొప్ప సంస్కృతి ఉంది. మేము ఈ కథలను వాటి ప్రామాణికమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఈ ప్రకనట చేశారు.