/rtv/media/media_files/2025/06/09/UM9BKLGfXTO8vtNToRb8.jpg)
thug life
విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రిలీజ్ అయిన ‘థగ్ లైఫ్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది.
Thug Life OTT
Streaming OTT On #Netflix 📺
— ⚡®️𝙖𝙞𝙙𝙚𝙣 ⚡𝘼𝘽𝙎𝙊𝙇𝙐𝙏𝙀 ©️𝙄𝙉𝙀𝙈𝘼 (@Absolutlycinema) July 3, 2025
🎬: Thug Life - 2025 ⚡
🎙️: Original Language: Tamil ✅
🎙️: Multi Languages Avail 👈
📅:Streaming from Now 🎯#ThugLifepic.twitter.com/2KXMhi6dv2
బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ‘ఇండియన్ 2’ మూవీతో భారీ ఫ్లాప్ అందుకున్న కమల్ హాసన్‌కు ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. దీంతో ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకుండానే ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
Also read: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు
దీంతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకరం.. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన సినీ ప్రేమికులు ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఓటీటీలో చూసేయొచ్చు.
Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
కమల్ కాంట్రవర్సీ కామెంట్స్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల చెన్నైలో 'థగ్ లైఫ్' మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో సంచలన కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని అన్నారు. దీంతో అక్కడ నుంచి వివాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
Kamal Haasan