Pushpa 2 OTT: ఓటీటీలోకి పుష్ప 2.. డేట్ ఖరారు: ఇక రచ్చ రచ్చే!

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 30న స్ట్రీమింగ్ కానుంది. 20 నిమిషాల అదనపు సీన్లు కూడా యాడ్ చేసి 3:44 గంటల రన్ టైంతో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

New Update
pushpa 2 movie streaming on ott platform netflix

pushpa 2 movie streaming on ott platform netflix soon


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా పేరు ఏదో ఒక విధంగా మారు మోగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసులు బద్దలు కొట్టింది. 

కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు రాబట్టింది. ఎన్నో రికార్డులను బద్దలు కట్టి.. మరెన్నో కొత్త రికార్డులను నెలకొల్పింది. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఏ ముహుర్తాన ఈ చిత్రం రిలీజ్ అయిందో కానీ.. విమర్శలు, ట్రోలింగ్స్ సహా మరెన్నో ఇబ్బందులతో నలిగిపోయింది. 

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

ఓటీటీలోకి పుష్ప 2

ఇక థియేటర్ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన వార్తలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల 30న అంటే మరో మూడు రోజుల్లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ఈ సినిమాలో 20 నిమిషాల అదనపు సీన్లు కూడా యాడ్ చేసి 3గంటల 44 నిమిషాల రన్ టైంతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు తహతహలాడుతున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు