OTT: ఈ సినిమాలు చూస్తే వాష్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేరు.. ఓటీటీలో బెస్ట్ సైకో-థ్రిల్లర్ చిత్రాలు ఇవే!

సైకో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఓటీటీలో ఈ ఐదు సినిమాలను చూడవచ్చు. అతిరన్, కింగ్ ఆఫ్ కొత్త, హసీన్ దిల్రుబా, రామన్ రాఘవ్ 2.0, కాపా. ఈ సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.

New Update
watching horror movies

watching horror movies

Best Psycho Thrillers : ఈ మధ్య రొమాంటిక్, కామెడీ చిత్రాల కంటే హర్రర్, సైకో థ్రిల్లర్స్ చూడడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా థ్రిల్లర్స్  ఇష్టపడే వారి కోసం ఇక్కడ కొన్ని చిత్రాల జాబితాను అందించాము. ఇవ్వన్నీ సైకో క్రైమ్ థ్రిల్లర్స్ (Best Psycho thrillers). ఈ సినిమాల్లో చాలా సస్పెన్స్ ఉంటుంది. మీరు భయస్థులు అయితే ఈ చిత్రాలను ఒంటరిగా అస్సలు చూడవద్దు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read :  మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌

సైకో క్రైమ్ థ్రిల్లర్స్

అతిరన్

ఒక మానసిక వైద్యుడు అతడి పేషంట్ మధ్య ఈ సినిమా కథ జరుగుతుంది. ఇందులో ఫహద్ ఫాసిల్ మానసిక వైద్యుడిగా, సాయిపల్లవి పేషేంట్ గా నటించారు. ఈ సినిమా  సస్పెన్స్, థ్రిల్లర్స్ తో  ప్రేక్షకులను ముంచెత్తుతుంది. డిస్నీ హాట్ స్టార్ లో (Disney Plus Hotstar). ఈ మూవీని చూడవచ్చు. 

 కింగ్ ఆఫ్ కొత్త

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో  నటించిన చిత్రం  'కింగ్ ఆఫ్ కొత్త'. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సాగే ఈ క్రైం థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. 2023లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని  డిస్నీ హాట్ స్టార్ లో చూడవచ్చు. 

Also Read :  ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలంటూ ఫ్యాన్‌ సూసైడ్‌ లెటర్‌

హసీన్ దిల్రుబా

హసీన్ దిల్రుబా.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. భర్త హత్యలో అనుమానితురాలిగా  భార్యను విచారిస్తున్న సమయంలో వారి వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన కథనాలు బయటకు వస్తాయి. ఈ మూవీలో తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే,  హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. 

Also Read :  అభిమాని ఫోన్ లాక్కున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

రామన్ రాఘవ్ 2.0

అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన సూపర్ హిట్ సైకో-క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0. ఈ సినిమా ప్రేక్షకులలో క్షణం క్షణం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని  ZEE5లో చూడవచ్చు. 

కాపా (Kaapa)

షాజీ ఖలీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, అన్నా బెన్,  దిలీష్ పోతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.  ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇద్దరు భార్య భర్తల కథ నేపథ్యంలో సాగుతుంది. 

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు