Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్

యూజర్ల  మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం ఇక మీదట ప్రైమ్ వీడియో కేవలం 5 పరికరాల్లో మాత్రమే లాగన్ అవగలుగుతారు. 

New Update
amazon prime

Amazon Prime

ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్...ఇది దాదాపు అందరూ చేస పనే. నలుగురు, ముగ్గురు కలిసి తీసుకోవడం..హాయిగా ఎంజాయ్ చేడం. కానీ ఓటీటీ ఫ్లామ్ ఫామ్‌లు తమ ఆదాలను పెంచుకునేందుకు దీన్ని నెమ్మదిగా కట్ చేస్తున్నాయి. కావల్సిన వాళ్ళు ప్రతీ ఒక్కరూ సబ్‌స్క్రప్షన్ తీసుకునే రూల్స్ పెడుతున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఈ పనిని చేసింది. ఇప్పుడు ప్రైమ్ కూడా అదే బాలో నడవాలని డిసైడ్ అయింది. సబ్‌స్క్రైబర్లు ఏకకాలంలో లాగిన్ చేయగల పరికరాల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

ఐదింటికి మాత్రమే అనుమతి..

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు తమ ఖాతాలను ఏకకాలంలో 10 పరికరాల్లో యాక్సెస్ చేయవచ్చు. ఆ సంఖ్యను 5 పరికరాలకు తగ్గించాలని కంపెనీ అనుకుంటోంది. దానికి తోడు వినియోగదారులు ఒకేసారి రెండు స్మార్ట్ టీవీలలో ప్రైమ్ వీడియో యాప్‌కి లాగిన్ అయ్యేలా మాత్రమే అనుమతించాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా మార్పులు చేస్తోంది. వచ్చే ఏడాది అంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ రూల్స్ అప్లై అయిపోతాయని చెబుతోంది. 

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు

ఏడాది ప్లాన్: రూ. 1,499 (ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రయోజనాలు).
మూడు నెలల ప్లాన్: రూ. 599
నెలవారీ ప్లాన్: రూ. 299
మొబైల్ ఎడిషన్ ప్లాన్: స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే (ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయడానికి అనుమతించే మొబైల్-నిర్దిష్ట ప్లాన్).

Also Read: Delhi: రెస్టారెంట్‌లో గాంధీ కుటుంబం సందడి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు