/rtv/media/media_files/2025/06/01/jSWTpe8Fr3lrPAsN1nuj.jpg)
squid game season 3 trailer release
‘స్క్విడ్ గేమ్’ సిరీస్ గురించి తెలియనివారుండరు. ఈ మధ్య ఈ సిరీస్ నెట్టింట ట్రెండింగ్ అయింది. డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి పార్ట్‌కు సినీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన రావడంతో రెండో పార్టును రూపొందించారు.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
Also Read : గాజాలో మిన్నంటుతున్న ఆకలి కేకలు..77 ట్రక్కులపై వేలాది మంది దాడి
Squid Game 3 Trailer
Also Read : మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఇది మరింతగా ఫేమస్ అయింది. ఆడియన్స్ ఈ సెకండ్ సిరీస్‌ను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. దీనికి బాగా క్రేజ్ రావడంతో ఇప్పుడు మూడో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వంలో చివరి సిరీస్ ‘స్క్విడ్‌గేమ్ 3’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సిరీస్ జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Also Read : పాకిస్తాన్ సరిహద్దులో ఈసారి ఆపరేషన్ షీల్డ్
Squid Game Season 3 trailer | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu