Prabhas Joined Kannappa Shooting : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa) షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. రీసెంట్ గానే విదేశాల్లో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ సెలెబ్రిటీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో మన పాన్ ఇండియా స్టార్(PAN India Star) ప్రభాస్(Prabhas) కూడా ఒకరు. ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నట్లు ఎంతో కాలంగా న్యూస్ వస్తూనే ఉంది.
కానీ ఇప్పటి దాకా డార్లింగ్ షూటింగ్ లో పాల్గొనలేదు. కన్నప్ప లో ప్రభాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నట్లు మంచు విష్ణు ఆ మధ్య స్వయంగా వెల్లడించడంతో ప్రభాస్ కన్నప్ప సెట్స్ లో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారని ఫ్యాన్స్ ఎంతో ఆకస్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఆ టైం రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభాస్ తాజాగా కన్నప్ప షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
Also Read : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?
‘కన్నప్ప’ సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్
‘కన్నప్ప’ సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదికూడా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటోను పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా కేవలం కాళ్ళను మాత్రమే చూపించారు.ఇందులో ప్రభాస్ శివ భక్తుడైన నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా మంచు విష్ణు షేర్ చేసిన ఫొటోలోనూ ప్రభాస్ అదే గెటప్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తున్నారు. అలాగే మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.