Kannappa Review: 'కన్నప్ప' కు క్లైమాక్స్ బలం... సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ, అలాగే మూవీలోని హైలైట్స్, కొన్ని లోపాలను  ఇక్కడ డిస్కస్ చేద్దాం.. 

author-image
By Archana
New Update

Kannappa Review: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. దాదాపు పదేళ్ల మంచు విష్ణు నిరీక్షణకు ఫలితం దక్కింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ, అలాగే మూవీలోని హైలైట్స్, కొన్ని లోపాలను  ఇక్కడ డిస్కస్ చేద్దాం.. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'కన్నప్ప'  తెరకెక్కింది. శ్రీకాళహస్తి కథ ఆధారంగా రూపొందిన ఈ మైథలాజికల్ డ్రామా  శివ భక్తిని, త్యాగాన్ని ప్రధానంగా చూపించింది.

సినిమా  హైలైట్స్ 

మూవీ క్లైమాక్స్

'కన్నప్ప'  సినిమాకు ప్రాణం క్లైమాక్స్ లోనే ఉంది. చివరి 40 నిమిషాలు చాలా పవర్‌ఫుల్‌గా, భావోద్వేగంగా సాగుతుంది. ఈ క్లైమాక్స్ చూస్తే  శివ భక్తులు కచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు.  

స్టార్ క్యామియోలు

ప్రభాస్ (రుద్ర), మోహన్‌లాల్ (కిరాత), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు, సీనియర్ నటుల క్యామియోలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. డైరెక్టర్ క్యామియోలను హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. 

ప్రభాస్ ఎంట్రీ 

సెకండ్ ఆఫ్ లో ప్రభాస్  ఎంట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. డార్లింగ్ ఎంట్రీ తర్వాత  సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, భావోద్వేగ సన్నివేశాలు  ఆకట్టుకున్నాయి.  అలాగే  అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు.

విష్ణు మంచు నటన

సినిమా  'కన్నప్ప' గా మంచు విష్ణు నటన ప్రేక్షకులను భావోద్వేగానికి చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లోని భావోద్వేగ సన్నివేశాలలో ఆయన నటన అద్భుతం అని చెప్పాలి. ఇది ఆయన కెరీర్ లోనే అత్యుత్తమ నటన అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. శివుడిపై కన్నప్పకు ఉన్న భక్తిని, ఆ త్యాగాన్ని విష్ణు తన నటలో బాగా  పలికించారు.

విజువల్స్ & VFX 

న్యూజిలాండ్ అందమైన లొకేషన్లలో చిత్రీకరణ, అలాగే ముఖ్యంగా క్లైమాక్స్ లోని VFX అద్భుతంగా ఉన్నాయి. వీటితో  సినిమాకు మంచి విజువల్ గ్రాండియర్ వచ్చింది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైథలాజికల్ డ్రామా  కావడంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషించింది. స్టీఫెన్ దేవస్సి అందించిన సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్  లో  బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 

సినిమా లోపాలు 

ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా 

సినిమా ఫస్ట్ హాఫ్  నెమ్మదిగా సాగుతుందని, కథనం కూడా నిలకడగా లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు అనవసరంగా పొడిగించినట్లు అనిపిస్తుందని ప్రేక్షకులు  అంటున్నారు.

పాత్రల పరిచయం

'కన్నప్ప' బాల్యాన్ని పరిచయం చేసిన విధానం సరిగ్గా లేదనే అభిప్రాయం ప్రేక్షకులలో కలిగింది. అలాగే కొన్ని కోట్ల కథనం ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదు.  కొన్ని డైలాగ్స్ అంత ప్రభావవంతంగా లేవని, కథకు తగ్గ బలం వాటిలో లేదని చెబుతున్నారు.

డబ్బింగ్ సమస్యలు

కన్నప్ప చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ (ఇంగ్లీష్ యాక్సెంట్ తో) కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు.

పాటలు 

భక్తి సినిమా అయినప్పటికీ, కొన్ని పాటలు కథనానికి సరిపోలేదని, ఆధునికమైనవిగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు, 'సగమై చేరిసగమై' పాటలోని కొన్ని లిరిక్స్, సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

మొత్తంగా  'కన్నప్ప' సెకండ్ హాఫ్ కి ముందు, సెకండ్ హాఫ్ తర్వాత అని చెప్పొచ్చు.  మొదటి భాగం నిరాశపరిచినా, సెకండ్ హాఫ్ .. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాను నిలబెట్టింది. విష్ణు మంచు నటన, స్టార్ క్యామియోలు, భావోద్వేగ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. భక్తి రసం, మైథలాజికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఒకసారి చూడవచ్చు. 

Also Read: Kannappa Twitter Review: ‘కన్నప్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు, ప్రభాస్ చించేశారా?- మూవీ ఎలా ఉందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు