/rtv/media/media_files/2025/06/27/kannappa-highlight-scene-2025-06-27-13-59-12.jpg)
kannappa highlight scene
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' భారీ అంచనాల నడుమ నేడు విడుదలైంది. విష్ణు మంచు నటన, స్టార్ క్యామియోలు, భావోద్వేగ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ అనేలా ఉంది. శివయ్యకు విష్ణు తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆ సమయంలో 'కన్నప్ప' విష్ణు భావోద్వేగ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. శివుడిపై కన్నప్పకు ఉన్న భక్తిని, ఆ త్యాగాన్ని విష్ణు తన నటలో బాగా పలికించారు. ఆ తర్వాత రుద్రా పాత్రలో ప్రభాస్ ఎంట్రీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మొత్తంగా మొదటి భాగం నిరాశపరిచినా, సెకండ్ హాఫ్ .. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాను నిలబెట్టింది.
what an actor bro @/iVishnuManchu
— Prudhvi (@PrudhviV12) June 27, 2025
inkosari act cheyaku 🙏#Kannappa#KannappaReviewpic.twitter.com/sTRZQRhzBZ
విజువల్ గ్రాండియర్
ప్రభాస్ తో పాటు నాథనాధుడిగా శరత్ కుమార్, శివుడిగా అక్షయ కుమార్, కిరాత పాత్రలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రేక్షకులను మైమరిపించారు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'మహాదేవ' పాత్రలో జీవించేశారు. ఎప్పటిలాగే ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫీమేల్ లీడ్ గా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ గ్లామర్ తో ఫిదా చేసింది. ఇక సినిమాలోని అద్భుతమైన లొకేషన్స్, వీఎఫెక్స్ తో మూవీకి విజువల్ గ్రాండియర్ వచ్చింది.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
'మహాభారతం' సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అంచు విష్ణు దాదాపు పదేళ్ల నిరీక్షణ ఈరోజుతో ఫలిచింది. ఇందులో మంచు ఫ్యామిలీ మూడు తారలు కనిపించాయి.