Manchu Manoj: మంచు విష్ణుతో వివాదాల వేళ 'కన్నప్ప' ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ వెళ్లారు. ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూశారు. అనంతరం సినిమాకు రివ్యూ కూడా ఇచ్చారు. తాను ఊహించిన దానికంటే వెయ్యి రేట్లు సినిమా చాలా బాగుందని అన్నారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని ప్రశంసించారు. అలాగే మూవీ క్లైమాక్స్ లో అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. పెట్టిన బడ్జెట్ కంటే వెయ్యింతలు కలెక్షన్స్ రావాలని ఆశిస్తున్నానని అన్నారు. అన్నతో గొడవలు ఉన్నప్పటికీ.. మనోజ్ సినిమా చూసి జెన్యూన్ గా రివ్యూ చెప్పడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
కన్నప్ప సినిమా చాలా చాలా బాగుంది : మంచు మనోజ్
— ChotaNews App (@ChotaNewsApp) June 27, 2025
ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది.
క్లైమాక్స్ లో ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు.
సినిమాలో అందరూ చాలా బాగా చేశారు.నేను అనుకున్న దాని కంటే సినిమా వెయ్యి రెట్లు బాగుంది.
- మంచు మనోజ్ pic.twitter.com/7M9Yo4rq8i
లాస్ట్ 40 నిమిషాలు హైలైట్
మొత్తంగా 'కన్నప్ప' సెకండ్ హాఫ్ కి ముందు, సెకండ్ హాఫ్ తర్వాత అని చెప్పొచ్చు. మొదటి భాగం నిరాశపరిచినా, సెకండ్ హాఫ్ .. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాను నిలబెట్టింది. విష్ణు మంచు నటన, స్టార్ క్యామియోలు, భావోద్వేగ క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే ప్రభాస్ ఎంట్రీ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు శివుడికి కన్ను దానం చేసిన భావోద్వేగ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. భక్తి రసం, మైథలాజికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.