Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు

మంచు విష్ణు 'కన్నప్ప' ను పైరసీ భూతం వెంటాడుతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఫుల్ సినిమాకు సంబంధించిన పైరసీ లింకులు ఆన్లైన్ విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

New Update
kannappa full review

kannappa full review

Kannappa Piracy: ఈ మధ్య టాలీవుడ్ సినిమాలను పైరసీ భూతం వెంటాడుతోంది. విడుదలైన రెండు, మూడు రోజులకే సినిమా ఫుల్ హెడీ ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మంచు విష్ణు 'కన్నప్ప' పై కూడా పైరసీ భూతం పంజా విసిరింది. విడుదలైన 3 రోజుల్లోనే  ఫుల్ సంబంధించిన వేలాది లింకులు ఆన్ లైన్లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.  పలు వెబ్ సైట్లలో హెడీ ప్రింట్ ప్రదర్శితమవుతోంది. దీంతో మేకర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు మంచు విష్ణు దీనిపై స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.     

మంచు విష్ణు పోస్ట్.. 

''ప్రియమైన సినిమా ప్రియులారా.. మా  'కన్నప్ప' సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30,000 కి పైగా అక్రమ లింక్‌లు తొలగించబడ్డాయి.ఇది ఎంతో బాధాకరమైన విషయం!  పైరసీ అనేది నిజానికి దొంగతనం!   మనం మన  పిల్లలకు దొంగతనం చేయమని  నేర్పించము కదా? పైరేటెడ్ కంటెంట్ చూడటం కూడా అలాంటి పనే. దయచేసి పైరసీ కంటెంట్ ని ప్రోత్సహించవద్దు.సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ పెట్టారు. 

జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన 'కన్నప్ప' ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సానుకూల స్పందన సొంతం చేసుకుంది. సినిమాలోని చివరి 40 నిమిషాలు, ప్రభాస్ ఎంట్రీ, మంచు విష్ణు హైలైట్ గా నిలిచాయని  ప్రేక్షకులు చెబుతున్నారు.  అలాగే స్టార్ క్యామియోలు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారని ప్రశంసలు వచ్చాయి. మూడు రోజుల్లో 'కన్నప్ప' రూ. 23 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు సమాచారం. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
తాజా కథనాలు