/rtv/media/media_files/2025/05/27/ydNOW0rdlVrIdEXFNlC9.jpg)
Kannappa Movie
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సెకండ్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి.
ఇది కూడా చూడండి:Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
రెండు రోజులకు కలిపి..
ఏరియా వారీగా ఎంత వచ్చిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమా రెండు రోజులకి ప్రపంచ వ్యాప్తంగా రూ.42.5 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ.20 కోట్లు, రెండో రోజు రూ.22.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కూడా సండే కావడంతో మూవీ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు సినిమాలను దాటేసి మరి కలెక్షన్లలో దూసుకెళ్తుంది.
ఇది కూడా చూడండి:Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
#Kannappa 2 Days Box Office
— Cine 4 Updates (@Cine4Updates) June 29, 2025
👉 Hindi Version - ₹1.5 Crs NETT
👉 AP/TG - ₹17.15 Crs Gross
👉 ROI + Overseas - ₹9.50 Crs Gross
⭐ Total WW - ₹26.65 Crs Gross#VishnuManchu#Prabhaspic.twitter.com/jvmE9AWrO6
ఇది కూడా చూడండి:ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతిథి పాత్రలో ప్రభాస్ మాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టర్ అతి పెద్ద సర్ ప్రైజ్. ముఖ్యంగా చిత్రంలోని ఎలివేషన్స్ అదిరిపోయాయి. అందులోనూ క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్స్ సినీ ప్రియుల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా బాగుందని నెటిజన్లు తెలిపారు. మొత్తానికి సినిమా హిట్ టాక్ అందుకుంది.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
movie | collections