Kannappa: 'కన్నప్ప' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ చెల్లి !

' కన్నప్ప' లో ముందుగా నటి నుపుర్‌ సనన్‌ కు అవకాశం రాగా ఆమె డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో ప్రీతి ప్రాజెక్టులో చేరింది.

New Update

Kannappa: భారీ అంచనాలతో రూపొందిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఇన్నేళ్ల మంచు విష్ణు నిరీక్షణకు ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. అన్ని చోట్ల  సినిమాకు పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మంచు విష్ణు  జోడీగా నటించిన   యంగ్ బ్యూటీ   ప్రీతీ ముకుందన్ తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగులో తొలి సినిమాతో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. 'నెమలి'  అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది. 

Also Read:Kannappa Twitter Review: ‘కన్నప్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు, ప్రభాస్ చించేశారా?- మూవీ ఎలా ఉందంటే?

మొదటగా నపూర్ 

అయితే మొదటగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి  నపూర్ సనన్ ని  అనుకున్నారట.  కానీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం  ప్రీతి ముకుందన్ ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఊపందుకుంటున్న   ప్రీతి  'కన్నప్ప'  లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం ఆమెకి  అదృష్టంగా మారింది.  ఈ సినిమా విజయంతో  ప్రీతికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Nuupur Sannon
Nuupur Sannon

ఇదిలా ఉంటే నపూర్  రవితేజ సరసన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆమె ఓ కీలకమైన పాత్రను పోషించింది. నపూర్ హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఫిల్హాల్' మ్యూజిక్ వీడియోతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. 

ఇది కూడా చూడండి:Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

Advertisment
తాజా కథనాలు