Hari Hara Veera Mallu New Poster : జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘హరిహరవీరమల్లు’ (Hari Hara Veera Mallu). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ఇటీవలే ఆగస్టు 14నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది.
నిధి అగర్వాల్ పోస్టర్
ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటించగా.. బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆమె కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో నిధి బంగారు రంగు చీర, ఒంటినిండా నగలు ధరించి యువరాణిలా కనిపించింది. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
Also Read: 70th National Film Awards: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. కాంతారా హైలైట్స్..! – Rtvlive.com