/rtv/media/media_files/2025/03/31/RVRRovEYBjWiEGChcMLa.jpg)
Pawan Kalyan Harihara Veeramallu
Hari Hara Veeramallu: ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీరిలీజ్ వేడుక వాయిదాపడింది. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామా క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా వాస్తవంగా జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందు వలన ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకొన్నట్టు సమాచారం.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
వాస్తవ కథతో హరి హర వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. అవసరాన్ని బట్టి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ జోడించినట్లు తెలిపారు. ఈ సినిమాను ఇరాన్ తో పాటు ఇతర దేశాల్లో టెక్నికల్ వర్క్ జరుగుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండటం, అలాగే ఇంకా పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, హడావిడిగా చివరి నిమిషంలో విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం.
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా షూటింగ్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సినిమాగా ఈ సినిమా చేరిపోయింది. సుమారుగా నాలుగు సార్లు ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దాంతో అభిమానులు ఆశలు, ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టు అయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ వాయిదాపై నిర్మాత, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనున్నది. కాగా ప్రీరిలీజ్ వేడుక మాత్రం వాయిదాపడింది. ఈ సినిమాను జూలై 5 తేదీన గానీ, జూలై 12వ తేదీన గానీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
Also Read : ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు