/rtv/media/media_files/2025/05/26/bJtDNysR0JYacpPHpnX3.jpg)
bandla ganesh sensational tweet at the time of dil raju press meet
Bandla Ganesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అని ప్రకటించడంతో నెట్టింట దుమారం రేగింది. అది కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) సినిమా రిలీజ్‌కు ముందు ఈ ప్రచారం సాగడంతో మరింత సంచలనం అయింది. థియేటర్లు మూసివేస్తారన్న(Theaters Close) నిర్ణయం వెనుక ఆ నలుగురే ఉన్నారని జోరుగా ప్రచారం నడవడంతో ఈ ఎపిసోడ్ వివాదంగా మారింది. దీనిపై ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగారు. తాను సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేస్తుంటే.. తనకు మంచి గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం తీవ్రమైన రచ్చకు దారితీసింది.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
అల్లు అరవింద్ కామెంట్స్
దీనిపై వెంటనే నిర్మాత అల్లూ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న తరుణంలో థియేటర్లు మూస్తామనడం తప్పని అల్లు అరవింద్ అన్నారు. థియేటర్లు మూస్తామన్న నలుగురితో తనను కలపొద్దని సూచించారు. డిప్యూటీ సీఎం పేషీ నుంచి రిలీజ్ అయిన లేఖను ఆయన సమర్ధించారు. ఏ వ్యాపారమైన ప్రభుత్వ సహకారం లేకుండా నడవదని నిర్మాత అరవింద్ అన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
సినీ ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. ఇండస్ట్రీ నుంచి వెళ్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని అల్లు అరవింద్ గుర్తుచేశారు. ఇండస్ట్రీ అభివృద్ధికి పవన్ కృషి చేస్తున్నారని ప్రసంశించారు. సమస్యని పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావాలని కోరారు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
దిల్ రాజు కామెంట్స్
ఇదే విషయంపై మరో బడా నిర్మాత దిల్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. ఈ నెల 30 తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని వెల్లడించారు. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని అన్నారు. పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని .. అందుకే ఆయన హార్ట్ అయ్యారని అన్నారు.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
బండ్ల గణేష్ కామెంట్స్
అయితే సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో మరో నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ‘‘ఆస్కార్ నటులు, కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీంతో అతడు దిల్ రాజ్, అల్లు అరవింద్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని పలువురు చర్చించుకుంటున్నారు. సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో ఈ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆస్కార్ నటులు , కమలహాసన్లు ఎక్కువైపోయారు . వీళ్ళ నటన చూడలేకపోతున్నాం …..!
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2025
dil-raju | bandla-ganesh | latest-telugu-news | telugu-news