HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!

పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత AM రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది జూన్ 12న రిలీజ్ కానుంది.

New Update
pawan kalyan hari hara veera mallu

pawan kalyan hari hara veera mallu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. జూన్ 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్‌లు ఇస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

HHVM Trailer Date

ఇక ఈ చిత్రం రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. 

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని.. అయితే సెకండ్ పార్ట్‌లో సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉండటంతో ట్రైలర్ రిలీజ్ లేటు అయిందని అన్నారు. ప్రస్తుతం సీజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఆ వర్క్ పూర్తి కాగానే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. 

Also Read: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

ఈ మేరకు త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే జూన్ ఫస్ట్ వీక్‌లో దీనిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఇటీవల దర్శకుడు జ్యోతికృష్ణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దీనికోసం నార్త్ ఇండియాలో ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు