Giorgia Meloni Shares ‘Melodi’ Selfie Video With Modi: ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ప్రధానులు మళ్లీ కలిసే సమయాన్ని జీ7 సదస్సు (G7 Summit) కలిపింది. ఇటలీలో జరుగుతున్న ఈ సదస్సుకు వచ్చిన మోదీకి.. జార్జియా మెలోని (Giorgia Meloni) స్వాగతం పలికారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో (PM Modi) కలిసి మెలోని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అలాగే తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ మెలోడీ అని క్యాష్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది.
Also Read: దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం.. రెండోసారి అధ్యక్షుడిగా రమాఫోసా
గతేడాది డిసెంబర్లో దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సు సందర్భంగా ఈ ఇద్దరు ప్రధానుల సెల్ఫీ ఫొటోలు వైరలయ్యాయి. మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోని తన ఎక్స్ షేర్ చేశారు. దానికి మెలోడి అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. మెలోడి అంటే మెలోని, మోదీ పేర్లు కలిసేలా ఉన్న పదం. అప్పటి నుంచి హ్యాష్టగ్ మెలోడీ పదం ట్రెండ్ అయ్యింది.
ఇదిలాఉండగా.. జీ7 సదస్సులో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా, జర్మనీ, ఇటలీతో పాటు పలుదేశాల అధినేతలతో విడివిడిగా కలిశారు. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చెపట్టిన మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024
Also Read: మోదీ-బైడెన్ ఆత్మీయ పలకరింపు!