G7 Summit: రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం..
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించాయి.