Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంపై జరుగుతున్న 'ఆన్లైన్ ట్రోలింగ్'ని IAS అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష నాయకులు చేసిన 'ఓట్ల చోరీ' ఆరోపణలతో జ్ఞానేష్ కుమార్ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా ఇటీవల రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీంతో ఆగస్టు 17న (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
దేశంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను ఎలక్టోరల్ రోల్స్ నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల గుర్తింపు వివరాలను ఆగస్టు 19లోగా తమకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR)పై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల లిస్టు నుంచి ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలను ఖండించింది.
రాహల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఎక్స్ వేదికగా టార్గెట్ చేశారు. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి, ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి చేయడమేనన్నారు.
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.