/rtv/media/media_files/2025/09/19/election-commission-de-lists-474-more-registered-unrecognised-parties-2025-09-19-17-07-49.jpg)
Election Commission de lists 474 more registered unrecognised parties
దేశంలో గుర్తింపు లేకుండా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ తగలింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాటిపై చర్యలకు దిగింది. రూల్స్ ఉల్లంఘించినటువంటి 474 పార్టీలను జాబితా నుంచి తొలగించనున్నట్లు ప్రకటన చేసింది. గత ఆరేళ్లుగా ఎన్నికల ప్రక్రియలో ఆ పార్టీలు పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక తొలిదశలో భాగంగా ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేశామని ఎన్నికల సంఘం తెలిపింది.
Also Read: భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు
EC Delisted Unrecognised Parties
రెండో దశలో భాగంగా 474 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను సెప్టెంబర్ 18న జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంది. రెండు నెలల వ్యవధిలోనే మొత్తంగా 808 రాజకీయ పార్టీలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఇప్పటిదాకా గుర్తింపు లేని నమోదిత పార్టీలు 2520 ఉన్నాయి. అయితే తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కి తగ్గింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, అలాగే 67 ప్రాంతీయ పార్టీ ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
EC de-lists 474 more registered unrecognised political parties for flouting norms pic.twitter.com/5qwvLy7uZC
— Press Trust of India (@PTI_News) September 19, 2025
Also Read: సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి..డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు