Election Commission: తెలంగాణలో SIR.. ఎలా చేస్తారో తెలుసా ?

తెలంగాణలో మరికొన్నిరోజుల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో రవీంద్రభారతీలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
Election Commission

Election Commission

తెలంగాణ(telangana)లో మరికొన్నిరోజుల్లో ఓటరు జాబితా(voter-list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో రవీంద్రభారతీలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బీహార్‌లో పూర్తయిన SIRను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణలో నిర్వహిస్తామని చెప్పారు. రెండో దశలో భాగంగా ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ సర్వే కొనసాగుతోందన్నారు. మూడో దశలో తెలంగాణలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అసలు SIRను అంటే ఏంటి ? దీన్ని ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. - election-commission

Also Read :  ఉపా కేసుపై మజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టు.. అసలేంటి ఈ చట్టం ?

SIR అంటే ఏంటి ?

SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(nationwide Special Intensive Revision). ఇది సాధారణంగా జరిగే ఓటరు సవరణ కాకుండా మరింత లోతుగా తనిఖీ చేసే ప్రక్రియ. దీని ద్వారా బోగస్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగిస్తారు. 1951 నుంచి 2004 వరకు వివిధ దశల్లో 13 సార్లు సర్‌ను నిర్వహించారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో ప్రారంభించారు. ఇటీవల బిహార్‌లో మొదటి దశలో భాగంగా SIRను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 25 నుంచి జులై 26 వరకు దీన్ని నిర్వహించగా దాదాపు 65 లక్షల మంది ఓటర్లను ఈసీ తొలగించింది. ఇందులో 22 లక్షల మంది చనిపోయిన వాళ్లే ఉన్నారు. ఆ తర్వాత రెండో దశలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్‌, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముసాయిదా జాబితా విడుదల చేయగా ఇతర రాష్ట్రాల జాబితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

SIR ఎలా నిర్వహిస్తారు ?

ఇంటింటి తనిఖీ: బూత్‌ లెవర్‌ ఆఫీసర్లు (BPO) మీ ఇంటికి వచ్చి ఓటరు జాబితాలో ఉన్న పేర్లను మీ కుటుంబ సభ్యుల వివరాలతో పోల్చి చూస్తారు. 
డిజిటల్ ఎన్యుమరేషన్ ఫారమ్ (EF): ప్రతి ఓటరుకు కూడా ఒక ప్రత్యేకమైన 'ఎన్యుమరేషన్ ఫారమ్'ను అందిస్తారు. ఇందులో మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని సంతకం చేయాల్సి ఉంటుంది.
ఆధార్ అనుసంధానం: ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తిస్తారు.
తొలగింపులు:చనిపోయిన వారు, ఇల్లు మారి వేరేచోటుకి వెళ్ళిపోయిన వారు, అనర్హులైన ఓటర్లను, ఒకటి కంటే రెండు చోట్ల ఓటర్లు ఉన్నవారిని జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించే ముందు వాళ్లకి నోటీసులు కూడా జారీ చేస్తారు. ఇక18 ఏళ్లు నిండిన యువతకు ఈ సర్వే సమయంలోనే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తారు. 

Also Read :  ప్రయాణీకులకు బిగ్ షాక్.. ఛార్జీల మోత

SIR ఎందుకు ముఖ్యం

ఎన్నికలు జరిగినప్పుడు నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఓటరు జాబితాలో తప్పులు ఉండటమేనని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉండటం వల్ల అక్రమాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. SIR ద్వారా డూప్లికేట్‌, ఫేక్ ఓట్లు అన్నింటినీ కూడా డిజిటల్ పద్ధతిలో తొలగిస్తారు. బీహార్‌లో 65 లక్షల అక్రమ ఓటర్లు తొలగించినట్లు రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది. 

BLO డ్యూటీ 

బీఎల్‌ఓ అధికారి ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేటర్ ఫామ్ ఇవ్వాలి. ఓటర్లు ఫామ్ ఫిల్ చేసేందుకు సాయం చేయాలి. ఆ తర్వాత ఓటరు నుంచి ఆ ఫామ్‌ను తీసుకొని రిసిప్టు అందించాలి. ఓటర్లు కూడా తమ ఇంటికి వచ్చే BLO అధికారికి సహకరించాలి. ఓటరు కార్డులోని వివరాలు (పేరు, వయస్సు, ఇంటి నంబర్) సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

Advertisment
తాజా కథనాలు