Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు  ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్‌ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్‌ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నవారిని ఈసీ కాపాడుతుందన్నారు రాహుల్. ఈ క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.  దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఒక పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలకు ఎక్కువగా ఓటు వేసే దళితులు, గిరిజనులు, మైనారిటీలు మరియు OBCలు వంటి నిర్దిష్ట వర్గాలను ప్రత్యేకంగా గుర్తించారని ఆయన అన్నారు.

100% ఆధారాలు ఉన్నాయి

తాను చేస్తున్న ఆరోపణలకు  100% ఆధారాలు ఉన్నాయని రాహుల్ చెప్పారు.  కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లు ఉపయోగించారన్న రాహుల్..  ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి ..  వాటిని ఎవరు ఆపరేట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో14 దరఖాస్తులు వెళ్లాయని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని,  ఓట్లు తొలగింపు వివరాలు ఇవ్వాలని కర్ణాటక సిఐడి కోరిన ఈసీ స్పందించలేదని రాహుల్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. 12 ఓట్లను తొలగించడానికి గోదాబాయి పేరుతో నకిలీ లాగిన్‌ను ఉపయోగించారని ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6,018 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని రాహుల్ అన్నారు.  కర్ణాటకతో పాటుగా మహారాష్ట్ర, హర్యానా, యూపీలలో కూడా ఇదే తరహా ఓట్ల చోరీ జరిగిందన్నారు రాహుల్. వారంలోపు ఓటు తొలగింపు వివరాలను అందించాలని రాహుల్ గాంధీ ఈసీని డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపు వివరాలను అందించకుండా ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య హంతకులను సమర్థిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు,

Also Read : OG Prakash Raj: 'సత్యా దాదా'గా ప్రకాష్ రాజ్.. 'OG' నుండి అదిరిపోయే పోస్టర్ రిలీజ్..

Advertisment
తాజా కథనాలు